calender_icon.png 13 May, 2025 | 4:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గావ్ చలో-బస్తీ చలో

13-04-2025 10:03:19 PM

  • బాన్సువాడ,(విజయకాంతి): బిజెపి పార్టీ చేపట్టిన గావ్ చలో బస్తీ చెలో కార్యక్రమంలో భాగంగా ఆదివారం కామారెడ్డి జిల్లా బీర్కూరు గ్రామంలో బాన్సువాడకు చెందిన బిజెపి  జిల్లా వైస్ ప్రెసిడెంట్ పైడిమలీ్ లక్ష్మీనారాయణ, టౌన్ సెక్రెటరీ పాశం భాస్కర్ లు పర్యటించారు. ఈ కార్యక్రమంలో భాగంగా కేంద్రం చేపడుతున్న అభివృద్ధి పనుల గురించి తెలిపారు. ఆర్టికల్ 370, కిసాన్ సమన్ నిది కింద 6000 రూపాయలు ఇస్తుందని పేర్కొన్నారు. గరీబ్ అన్న కళ్యాణ్ యెజన కింద సన్న బియ్యం ఇస్తుందని అన్నారు. రాజ్యసభలో వక్ప్ప చట్టం బిల్లు సవరణ చేయడం జరిగిందని తెలిపారు, కేంద్రం చేపడుతున్న అనేక అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో బీర్కూర్ మండల బిజెపి ప్రధాన కార్యదర్శి మల్లెల యోగేశ్వర్, నాయకులు సాయిబాబా, వడ్ల బసవరాజ్, శంకర్ పాల్గొన్నారు.