09-08-2025 10:31:19 PM
సూర్యాపేట డీఎస్పీ ప్రసన్న కుమార్
సూర్యాపేట (విజయక్రాంతి): జిల్లాలో ఎవరైనా వ్యభిచారం, జూదం లాంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే ఎంతటి వారైనా చట్టపరమైన చర్యలు తప్పవని సూర్యపేట డీఎస్పీ ప్రసన్నకుమార్(DSP Prasanna Kumar) హెచ్చరించారు. జిల్లా కేంద్రంలోని డీఎస్పీ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పట్టణంలోని ఆర్వి హాస్పిటల్ పక్కన శ్రీశ్రీ నగర్ లో కొందరు వ్యక్తులు నామ సైదులు అనే వ్యక్తి ఇంటిని స్థావరంగా చేసుకొని జూదం ఆడుతున్నట్లు పక్కా సమాచారం రావడంతో పోలీసులు దాడి చేసి పట్టుకున్నారన్నారు. దీనిలో 8 మందిని అరెస్టు చేసినట్లు వారి వద్ద నుండి రూ.42 వేల నగదు, నాలుగు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారన్నారు. జిల్లాలో ఎవరైనా బహిరంగంగా మద్యపానం సేవించిన, జూదం, వ్యభిచారం, రాత్రి వేళల్లో ఆకతాయి పనులు చేసిన వదిలే ప్రసక్తి లేదన్నారు. ఈ సమావేశంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.