calender_icon.png 10 August, 2025 | 12:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆదివాసుల హక్కుల సాధనకై పోరాటానికి సిద్ధం కావాలి

09-08-2025 10:28:20 PM

సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ..

యాచారం: ఆదివాసుల హక్కుల సాధనకై పోరాటానికి సిద్ధం కావాలని సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ(CPM Party State Secretary John Wesley) అన్నారు. శనివారం మంతన్ గౌరెల్లి గ్రామంలో ఆదివాసి గిరిజన హక్కుల దినోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారతదేశంలో ఆదివాసి గిరిజన పరిస్థితి రోజురోజుకి దిగజారుతుందని 2022లో ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసిందని అన్నారు. అనేక ఆదివాసి గిరిజన తెగల్లో ఆకలి చావులతో పాటు కోట్లాదిమంది పేదరికంలోకి నెట్టబడ్డారని అన్నారు. రాజ్యాంగంలో ఆదివాసి కల్పించిన హక్కులు చట్టాలు రిజర్వేషన్లు వంటివి క్రమంగా దూరం అవుతున్నాయని వాటిని రక్షించాల్సిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వీర్యం చేస్తున్నాయని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను విమర్శించారు. దేశంలో అనేక సంవత్సరాలుగా అమలవుతున్న గిరిజన హక్కులు గత  కాలంలో కాలరాయపడ్డాయని అన్నారు.

ఫలితంగా లక్షలాదిమంది గిరిజన యువత ఉద్యోగ అవకాశాలకు దూరమయ్యారని అన్నారు. దశాబ్దాలుగా  అటవీ ప్రాంతాల్లో జీవనం సాగిస్తున్న ఆదివాసి  గిరిజనులను ప్రాజెక్టు ఖనిజ తవ్వకాలు అభివృద్ధి పేరుతో వారి భూములను లాక్కొని బలవంతంగా గెంటేస్తున్నారు. దీనివల్ల ఉన్న హక్కులు కోల్పోయి కోట్లాదిమంది ఆదివాసి గిరిజనులు నిరక్ష రాశులుగా  మారి పొట్ట చేతపెట్టుకొని పట్టణ ప్రాంతాలకు వలసలకు వెళ్లాల్సిన దురిస్థితికి నెట్టేయబడ్డ ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు.కావున గిరిజనులు తమ హక్కుల సాధనకై ఐక్యంగా పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ రాష్ట్ర కంట్రోల్ కమిటీ చైర్మన్ డిజి నరసింహారావు, సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య, పార్టీ మండల కార్యదర్శి ఆలంపల్లి నరసింహ,మండల కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్ చందు నాయక్, మండల నాయకులు కే. తావు నాయక్, మౌనిక,  కందుల శ్రీరాములు,  గిరిజనులు తదితరులు  పాల్గొన్నారు