09-08-2025 10:34:05 PM
కొత్తపల్లి (విజయక్రాంతి): నేను నీకు రక్ష నీవు నాకు రక్ష అలాగే మీడియా మిత్రులందరూ మన ప్రజాస్వామ్యానికి రక్ష. నేడు క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభమైన రోజు సందర్బంగా క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో మనకు బ్రిటిష్ వాళ్లు బయటకు వెళ్ళుడో మనకు చావో రేవో తేల్చుకుందాం అని అప్పుడు మహాత్మాగాంధీ ఆధ్వర్యంలో అప్పటి నాయకులందరూ సమిష్టి స్ఫూర్తితో డు ఆర్ డై క్విట్ ఇండియా అనే నినాదంతో ప్రజలను జాగరూకత చేసి మన భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించడానికి ఒక మలుపు. ఈ సందర్భంగా గాంధీ క్లబ్ ఆధ్వర్యంలో కరీంనగర్ పట్టణంలోని కలెక్టర్ కార్యాలయంలో గల గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ప్రస్తుత కాలమాన పరిస్థితులలో క్విట్ ప్లాస్టిక్, క్విట్ డ్రగ్స్,క్విట్ ఆల్కహాల్, క్విట్ గుట్కా అని మనం పిలుపునిచ్చి అందరం కూడా పాటించి ప్రపంచంలోనే అగ్రగామిగా నిలవాల్సిన అవసరం ఉంది గాంధీ క్లబ్ సభ్యులు అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ తెలంగాణ గాంధీ క్లబ్స్ జోగినపల్లి రఘునందన్ రావు, ప్రెసిడెంట్, గాంధీ క్లబ్స్ ,కరీంనగర్,తాటికొండ భాస్కర్, ఉప్పల రామేశం, పెండ్యాల కేశవ్ రెడ్డి, చిట్టీమల్ల దామోదర్, కాచం కృష్ణ మూర్తి , సత్యనారాయణ రాజు , తోడుపునూరి తిరుపతి మరియురాచమళ్ళ నర్సయ్య పాల్గొన్నారు.