calender_icon.png 29 July, 2025 | 9:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యూరియా కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం

24-07-2025 02:30:26 PM

ఎంపీడీవో జలంధర్ రెడ్డి

వలిగొండ,(విజయక్రాంతి): యూరియా కృత్రిమ కొరతను సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎంపీడీవో జలంధర్ రెడ్డి(MPDO Jalandhar Reddy) అన్నారు. వలిగొండ మండల కేంద్రంలోని నాలుగు ఫెర్టిలైజర్ షాపులను యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన రఘురామ ఫర్టిలైజర్ షాప్ లోని స్టాక్ రిజిస్టర్ లను, యూరియా నిల్వలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూరియా కోసం వచ్చే ప్రతి రైతు వద్ద నుండి ఆధార్ కార్డు తీసుకొని నమోదు చేయాలని, అదేవిధంగా భూమి పాస్ పుస్తకాన్ని తీసుకోవాలని ఆయన అన్నారు. ఫర్టిలైజర్ దుకాణదారులు యూరియా స్టాక్ నిల్వనం ఎప్పటికప్పుడు సూచిక బోర్డుల మీద ప్రదర్శించాలని, రిజిస్టర్లలో నమోదు చేయాలని, యూరియా సమాచారాన్ని ప్రతి రైతు తెలుసుకొనే విధంగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో  రైతులు గుడిసె రాంరెడ్డి, పైళ్ల మల్లారెడ్డి, కొమ్మిడి లక్ష్మారెడ్డి, శ్యామల శ్రీకాంత్ రెడ్డి, సోలిపురం దేవేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.