calender_icon.png 30 July, 2025 | 10:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హాస్టల్లో మెనూ కచ్చితంగా పాటించాలి: ఎమ్మెల్యే మురళి నాయక్

24-07-2025 02:33:16 PM

మహబూబాబాద్, (విజయక్రాంతి): పేద విద్యార్థుల సంక్షేమం కోసం ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న కామన్ మెనూ ప్రకారం హాస్టల్ విద్యార్థులకు భోజనం, ఇతర సౌకర్యాలు కల్పించాలని మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్(Mahabubabad MLA Bhukya Murali Naik) హాస్టల్ నిర్వాహకులకు సూచించారు. కేసముద్రం పట్టణంలోని గిరిజన సంక్షేమ బాలికల గురుకులం, ఎస్సీ బాలుర హాస్టల్ ను గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హాస్టల్ లో వసతులను సౌకర్యాలను విద్యార్థులకు వండిన భోజనాన్ని పరిశీలించారు.  విద్యా బోధనతోపాటు వసతి, భోజనం అమలులో నిర్లక్ష్యం చూపకూడదని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు జెన్నారెడ్డి భరత్ చందర్ రెడ్డి, మార్కెట్ చైర్మన్ గంట సంజీవరెడ్డి, డిసిసి ఉపాధ్యక్షుడు అంబటి మహేందర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు అల్లం నాగేశ్వరరావు, ట్రాన్స్పోర్ట్ అథారిటీ సభ్యుడు రావుల మురళి తదితరులు పాల్గొన్నారు.