16-12-2025 12:54:00 AM
కలెక్టర్ జితేష్ వి. పాటిల్
భద్రాద్రి కొత్తగూడెం, డిసెంబర్ 15, (విజయక్రాంతి): జిల్లాలో తుది విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జూలూరుపాడు, సుజాతనగర్, లక్ష్మీదేవిపల్లి, ఇల్లందు, అల్లపల్లి, గుండాల, టేకులపల్లి మండలాల్లో ఎన్నికలు పూర్తిస్థాయిలో, ప్రశాంత వాతావరణంలో, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా విజయవంతంగా నిర్వహించేం దుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అధికారులను ఆదేశించారు.
సోమవారం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు, జనరల్ అబ్జర్వర్ సర్వేశ్వర్ రెడ్డి, ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ లావణ్య, ఎంపీడీవోలు, తహసీల్దార్లు, పోలీసు అధికారులు, ఎన్నికల సిబ్బందితో టెలీకాన్ఫరెన్స్ ద్వా రా నిర్వహించిన సమీక్షా సమావేశంలో కలెక్టర్ ఈ మేరకు సూచనలు చేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మొదటి మరియు రెండవ విడత పంచాయతీ ఎన్నికలను ప్ర శాంతంగా, విజయవంతంగా నిర్వహించిన అధికారులు, సి బ్బందిని అభినందించారు.
గత విడతల అనుభవాలను దృ ష్టిలో ఉంచుకొని తుది విడతలో ఎటువంటి లోపాలకు తావు లేకుండా ఖచ్చితమైన ప్రణాళికతో ఎన్నికలు నిర్వహించాలని స్పష్టం చేశారు.రేపు డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల ద్వారా ఎన్నికల నిర్వహణకు అవసరమైన సామాగ్రి పంపిణీ జరగనున్న నేపథ్యంలో జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.
అల్లపల్లి మండలానికి మండల ప్రజా పరిషత్ కా ర్యాలయం, గుండాల మండలానికి టిటిడబ్ల్యుఆర్జేసీ బాలుర పాఠశాల, జూలూరుపాడు మండలానికి జెడ్పిహెచ్‌ఎస్, లక్ష్మీదేవిపల్లి మండలానికి ప్రశాంత్నగర్ జీపీ పరిధిలోని శ్రీరామ చంద్ర డిగ్రీ కాలేజ్ వద్ద, సుజాతనగర్ మండలానికి జిల్లా పరిషత్ హై స్కూల్, సుజాతనగర్ వద్ద, టేకులపల్లి మండలానికి గోల్యా తండా గ్రామపంచాయతీ పరిధిలోని ప్రభుత్వ హై స్కూల్, టేకులపల్లి వద్ద, అలాగే ఎల్లందు మండలానికి ఎస్సీసీఎల్ హై స్కూల్, ఇల్లందు వద్ద డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను ఏ ర్పాటు చేసినట్లు తెలిపారు.
ఈ కేంద్రాల ద్వారా రేపు బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లు, ఓటర్ రిజిస్టర్లు, ఎన్నికల స్టేషనరీ తదితర సామాగ్రిని ఎన్నికల సిబ్బందికి క్రమబద్ధంగా పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల్లో ఎన్నికల సిబ్బందికి తాగునీరు, భోజనం, విద్యుత్, స్ట్రాంగ్ రూమ్ వంటి అన్ని మౌలిక సదుపాయాలు కల్పించినట్లు తెలిపారు. సా మాగ్రి తరలింపుకు అవసరమైన వాహనాలను పూర్తిస్థాయిలో సిద్ధం చేసి, ఎటువంటి ఆలస్యం జరగకుండా ముంద స్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
పో లింగ్ కేంద్రాల్లో రద్దీ ఏర్పడకుండా తగిన ఏర్పాట్లు చేయాలని, ప్రతి పోలింగ్ కేంద్రంలో ఓటర్ రిజిస్టర్ను కచ్చితంగా నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రతి ఓటరును రిజిస్టర్తో సరి పోల్చి ధృవీకరించిన అనంతరమే ఓటు వేయడానికి అనుమతించాలని, దొంగ ఓట్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం ఇ వ్వకూడదని స్పష్టం చేశారు.సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ను తప్పనిసరిగా అమలు చేసి, వీడియో కెమెరాల ద్వారా బ్యాలెట్ బాక్సులను నిరంతరం పర్యవేక్షించేలా ఏర్పా ట్లు చేయాలని తెలిపారు.
పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్స్ల ను కౌంటింగ్ కేంద్రాలకు తరలించేందుకు అవసరమైన వాహనాలను ముందుగానే సిద్ధంగా ఉంచి, నిర్ణీత రూట్ మ్యాప్ ప్ర కారం సురక్షితంగా తరలించాలని ఆదేశించారు. పోలింగ్ అ నంతరం బ్యాలెట్ పేపర్లను స్ట్రాంగ్ రూమ్లో మాత్రమే భద్రపరచాలని, ఎటువంటి నిర్లక్ష్యం వ్యవహరించిన కఠిన చర్యలు తీ సుకోబడతాయని హెచ్చరించారు.
కౌంటింగ్ కేంద్రాల్లో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడంతో పాటు, రెండు వేలకుపైగా ఓ టర్లు ఉన్న ప్రాంతాల్లో అదనపు సిబ్బందిని మోహరించాలని సూచించారు. తుది విడత పంచాయతీ ఎన్నికలు పూర్తిగా విజయవంతమయ్యేలా ప్రతి అధికారి బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని ఆయన పిలుపునిచ్చారు.