06-10-2025 04:40:39 PM
గజ్వేల్: పాఠ్యపుస్తకాలలోని అంశాలతో పాటు ప్రయోగపూర్వకంగా నైపుణ్య శిక్షణను అందించడం వల్ల వృత్తి విద్యతో విద్యార్థులు చక్కని ఉపాధి పొందగలుగుతారని గజ్వేల్ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కళాశాలలో వృత్తి విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు ఆన్ జాబ్ ట్రైనింగ్ ఇవ్వడం కోసం గజ్వేల్ లోని సెట్విన్ వృత్తి విద్య శిక్షణ కేంద్రాన్ని వారు సిబ్బందితో కలిసి సోమవారం సందర్శించారు. శిక్షణ కేంద్రం ఇంచార్జ్ ఎంఏ ఖదీర్ తో విద్యార్థులకు అందించాల్సిన శిక్షణ గురించి చర్చించారు. విద్యార్థులకు మెకానికల్, ఎలక్ట్రికల్, రిఫ్రిజిరేషన్ ఏయిర్ కండిషన్, సీసీ కెమెరాలపై శిక్షణ ఇవ్వన్నట్లు ఈ సందర్భంగా తెలిపారు. కార్యక్రమంలో కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.