06-10-2025 06:07:36 PM
రాష్ట్ర అధ్యక్షుడు పోచంపల్లి రమణ రావు..
హైదరాబాద్: తెలంగాణ బ్రాహ్మణ సంఘ సమాఖ్య రాష్ట్ర కార్యవర్గ సమావేశం రాష్ట్ర కార్యదర్శి ఖానాల శ్యాంసుందర్ రావు నివాసంలో జరిగింది. ఈ కార్యక్రమంలో నూతనంగా ఏర్పడినటువంటి బ్రాహ్మణ సంఘ సమాఖ్య రాష్ట్ర కార్యవర్గంను ఎన్నుకోవటం సంఘ విధివిధానాలను గూర్చి సమీక్షించడం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షులు పోచంపల్లి రమణారావు రాష్ట్ర ఉపాధ్యక్షులు దేవులపల్లి రంగారావు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కానాల శ్యాంసుందర్రావు వర్కింగ్ ప్రెసిడెంట్ చెన్నూరు లక్ష్మీనరసింహారావు, రాష్ట్ర ఉపకోశాధికారి గూడ రాజేశ్వరరావు, సంయుక్త కార్యదర్శి గూడ జయరాం, ఆర్థిక సలహాదారుగా దేసీతారామచంద్రరావు, మీడియా ఇంచార్జ్ మంత్రి ప్రగడ శ్రీకాంత్, మాల్యాల వెంకటేశ్వరరావు తదితర సంఘ సభ్యులు హాజరై సంఘం విధివిధానాల గురించి చర్చించారు. భవిష్యత్ కార్యాచరణలను మరొక మీటింగులో చర్చించుకుందాం అని అన్నారు.