calender_icon.png 6 October, 2025 | 8:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అద్భుతప్పి ప్రైవేటు బస్సు బోల్తా

06-10-2025 06:18:00 PM

44వ జాతీయ రహదారిపై ఘటన 

పలువురు ప్రయాణికులకు గాయాలు 

నాందేడ్ నుంచి హైదరాబాద్ వెళుతున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు 

కామారెడ్డి జిల్లా క్యాసంపల్లి వద్ద ఘటన 

కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలో 44వ జాతీయ రహదారిపై ఓ ప్రైవేట్ బస్సు సోమవారం ఉదయం బోల్తా పడింది. స్థానికుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. నాందేడ్ నుంచి హైదరాబాద్కు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సులో 30 మంది ప్రయాణికులతో వెళ్తుండగా ఇటీవల కురిసిన భారీ వర్షాలకు జాతీయ రహదారిపై గుంతలు ఏర్పడ్డాయి. కామారెడ్డి పట్టణ శివారులోని సిరిసిల్ల బైపాస్ వద్ద 44 జాతీయ రహదారిపై అదుపుతప్పి ప్రైవేటు బస్సు బోల్తా పడింది. బస్సు బోల్తా పడిన చోట ఇటీవల వారి కురిసిన భారీ వర్షాలకు రోడ్డు కోతలకు గురైంది.

దాంతో రోడ్డు పక్కన ఉన్న కుంటలో బస్సు బోల్తా పడింది. బస్సులో ప్రయాణిస్తున్న 30 మంది ప్రయాణికులు కొంతమందికి గాయాలు అయ్యాయి. వారిని వెంటనే కామారెడ్డి జిల్లా కేంద్ర ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ప్రస్తుతం కామారెడ్డి జిల్లా కేంద్ర ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స పొందిన ప్రయాణికులు వారి స్వగ్రామాలకు వెళ్లారు. పట్టణ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.