06-10-2025 04:38:39 PM
నకిరేకల్ (విజయక్రాంతి): రీజినల్ రింగ్ రోడ్డు పేరుతో రైతుల వద్ద బలవంతంగా భూములు లాక్కునే పద్ధతి సరైంది కాదని భూ నిర్వాసితుల పక్షాన పోరాడుతున్న సిపిఎం నాయకులను రైతులను అక్రమంగా అరెస్టు చేయడం ప్రజాస్వామికమని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు జల్లెల పెంటయ్య ప్రభుత్వాన్ని విమర్శించారు. సిపిఎం నాయకులను రైతులను అరెస్టు నిరసిస్తూ రామన్నపేట మండల కేంద్రంలోని సుభాష్ సెంటర్ లో నల్ల జెండాలతో సిపిఎం కార్యకర్తలు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పెంటయ్య మాట్లాడుతూ త్రిపుర రోడ్డులో గతంలో చేసిన అలైన్మెంట్ కు విరుద్ధంగా నూతనంగా చేయడం అనేకమంది పేద రైతుల భూములు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని దివిస్ లాంటి కార్పొరేటు బడా పెట్టుబడిదారులకు తలొగ్గి అమాయక రైతుల భూములు బలి చేయవద్దని అన్నారు. భూములు కోల్పోతున్న రైతులకు భూమికి బదులుగా భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం రైతు సంఘం మండల కార్యదర్శి బోయిని ఆనంద్ మండల కార్యదర్శి వర్గ సభ్యులు కందుల హనుమంతు కల్లూరి నాగేష్, మండల కమిటీ సభ్యులు గొరిగే సోములు, మేడి గణేష, ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షుడు గంటెపాక శివ కుమార్, డివైఎఫ్ఐ జిల్లా నాయకుడు గుండాల నరేష్, మండల అధ్యక్షుడు శానగొండ రామచంద్రం, శాఖా కార్యదర్శులు మునికుంట్ల లెనిన్, కునూరు మల్లేష్, గుండాల ప్రసాద్, బావండ్లపల్లి సత్యం, గుణగంటి మల్లేశం, నాగటి లక్ష్మణ్, తాడూరి కృష్ణ, గుండాల బిక్షం, గుండాల నరేష్, కొమ్ము నాగరాజు, కొమ్ము నరేష్ తదితరులు పాల్గొన్నారు.