10-09-2025 05:56:48 PM
హనుమకొండ (విజయక్రాంతి): హనుమకొండలోని సిద్దార్థనగర్ నివాసి, సదాశయ ఫౌండేషన్(Sadashaya Foundation) సభ్యుడైన గాదె ఆరోగ్యరెడ్డి తల్లి గాదె మేరీలమ్మ(85) అనారోగ్యంతో మరణించగా, నేత్రదానంపై అవగాహన ఉన్న ఆరోగ్య రెడ్డి, సోదరుడు బెంజిమెన్ రెడ్డి సదాశయ ఫౌండేషన్ జాతీయ అధ్యక్షులు శ్రవణ్ కుమార్ కు తెలియపర్చగా వారు ఎల్విపి నిపుణుడు నరేందర్ సహకారంతో కార్నియాలు సేకరించి హైదరాబాద్ ఐ బ్యాంక్ పంపించడం జరిగింది. అనంతరం ఆరోగ్య రెడ్డి మాట్లాడుతూ, అవయవదానంపై అవగాహన కల్పించడం వల్ల ఇతరులకు నేత్రదానం చేసిన వాళ్ళు అవుతామని, తమ తల్లి యొక్క నేత్రాలను దానం చేసినందుకు సంతోషంగా ఉందని అన్నారు. ఇద్దరు అంధులకు చూపును ప్రసాదించిన నేత్రదాత కుమారులు ఆరోగ్యరెడ్డి, బెంజిమెన్ రెడ్డిలకు, కోడండ్లు, మనుమలకు, సహకరించిన కుటుంబ సభ్యులందరికి ఫాదర్ కాసు మర్రెడ్డి, బంధువులు మత్యాస్ రెడ్డి, ఫాతిమా రెడ్డి, ఇన్నారెడ్డి, సదాశయ ఫౌండేషన్ ప్రతినిధులు శ్రవణ్ కుమార్, దళపతి, శంకర్రావు, వేణుమాధవ్, పురుషోత్తం, ప్రొఫెసర్ లక్ష్మారెడ్డి, శ్రీనివాస్ లు అభినందించారు.