calender_icon.png 10 September, 2025 | 9:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాల్య వివాహాలను అరికట్టాలి..

10-09-2025 06:11:21 PM

రత్తిపల్లి మాజీ సర్పంచ్ మాధగోని రాజేష్ గౌడ్..

మునుగోడు (విజయక్రాంతి): బాల్య వివాహాలను అరికట్టి, 18 సంవత్సరాల వయసు నిండిన తర్వాతనే బాలికలకు వివాహాలు చేయాలని రత్తిపల్లి మాజీ సర్పంచ్ మాధగోని రాజేష్ గౌడ్ అన్నారు. బుధవారం మండలంలోని రత్తపల్లి గ్రామంలో సమగ్ర బాలల పరిరక్షణ పథకంలో భాగంగా బాలల పరిరక్షణ కమిటీ సభ్యుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. గ్రామంలో బాల్య వివాహాలను అరికట్టాలని, చిన్న వయసులో వివాహాలు జరిపిస్తే వచ్చే అనర్థాల గురించి ప్రజలకు అవగాహన, బాలికల సంరక్షణలో తల్లి పాత్ర కీలకమని, ప్రతిరోజు మంచి చెడులపై అవగాహన కల్పించాలని కోరారు. బాలికలపై జరుగుతున్న వేధింపులకు ఫోక్సో చట్టం ద్వారా శిక్షలు విధించబడతాయని ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమం నిర్వహించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో సమగ్ర బాలల పరిరక్షణ పథకం అవగాహన కర్త రాము, పంచాయతీ కార్యదర్శి శ్రీకాంత్ , పాఠశాల ప్రధానోపాధ్యాయులు నర్సిరెడ్డి , సూపర్వైజర్ నాగమణి ,అంగన్వాడి టీచర్ మంగమ్మ,  ఆశ వర్కర్ లింగమ్మ, వివోఏ సుజాత, గ్రామ ప్రజలు మహిళా సంఘాల సభ్యులు గ్రాచాయతీ ఉన్నారు.