10-09-2025 06:09:22 PM
మునుగోడు (విజయక్రాంతి): చాకలి ఐలమ్మ పోరాటస్పూర్తితో ఉద్యమాలకు సిద్ధం కావాలని సిపిఎం మునుగోడు మండల కార్యదర్శి సాగర్ల మల్లేష్(CPM Mandal Secretary Sagarla Mallesh) అన్నారు. బుధవారం మునుగోడు మండల సిపిఎం కార్యాలయంలో చాకలి ఐలమ్మ 40 వర్ధంతి సందర్భంగా ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి జోహార్లు అర్పించి మాట్లాడారు. భూమికోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం జరిగిన మహత్తర వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ముందుండి దొరలకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వీరనారి ఐలమ్మ ఆమె స్ఫూర్తితో నేటి యువత ముందుండాలని అన్నారు. జమీందారు వ్యవస్థలో గ్రామాల్లో రైతులు ఎన్నో బాధలు అనుభవించేవారు ఐలమ్మ ఈ పరిస్థితిని ఎదుర్కొని రైతుల పక్షాన నిలిచారు అని అన్నారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో భాగమై భూస్వాముల అక్రమ హక్కులను వ్యతిరేకించారు.భూమిపై హక్కుల కోసం సామాజిక న్యాయం కోసం సమానత్వం కోసం పోరాడిన తొలి మహిళ చాకలి ఐలమ్మని కొనియాడారు.
ఉద్యమ నేతలతో ఆమె ఒకరు తెలంగాణ ప్రాంతంలో నిజాం పాలనలో జరుగుతున్న దోపిడి పీడనా వ్యట్టిచాకిరి త్వరలో జమీందారులు జాకిర్దారుల వ్యతిరేకంగా జరిగిన గొప్ప పోరాటంలో కమ్యూనిస్టు యువధాన యోధులు అనేక త్యాగాలు చేసి ప్రజలకు అండగా నిలిచార అని అన్నారు.ఈ పోరాటంలో 10 లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచారని మూడు వేల గ్రామ రాజ్యాలు ఏర్పడ్డాయని వెట్టి చాకిరిరద్దు చేయబడిందని, జమీందారులను గ్రామాల నుండి తరిమికొట్టారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఎందరో ముస్లింలు నాయకులు మగ్గం మోహిని దున్ సోయాబుల్లాఖాన్ షేక్ బందగి లు నిజాం పాలనకు వ్యతిరేకంగా విరోచితంగా పోరాడిన వారు ,రాష్ట్రంలో సాయిధ పోరాటాలకు నిజమైన వారసులు కమ్యూనిస్టులే అని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు వరికుప్పల ముత్యాలు,డివైఎఫ్ఐ మండల నాయకులు నరేష్, యాట వంశీ, సైదులు ఉన్నారు.