10-09-2025 05:53:29 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రవాణా శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన తనిఖీల్లో భాగంగా మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ లో ట్రాన్స్పోర్ట్ అధికారులు ప్రత్యేకంగా వాహనాల తనిఖీలు చేపట్టారు. జిల్లా ట్రాన్స్ పోర్ట్ అధికారి జైపాల్ రెడ్డి(District Transport Officer Jaipal Reddy) పర్యవేక్షణలో వాహనాలను తనిఖీ చేసి పలు వాహనాల ఆర్ సి, ఇన్సూరెన్స్, ఫిట్నెస్, డ్రైవింగ్ లైసెన్స్ పరిశీలించారు. నిబంధనల మేరకు సరైన ధ్రువపత్రాలు లేని వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా డి.టి.ఓ మాట్లాడుతూ, రోడ్లపై తిరిగే ప్రతి వాహనం రవాణా శాఖ నిబంధనల మేరకు సరైన పత్రాలు కలిగి ఉండాలని, యజమానులు సరైన పత్రాలు లేకుండా వాహనాలను నడిపితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఐ లు రవిశంకర్, కోటిరెడ్డి, ఎం వీ ఐ కుమారస్వామి, సిబ్బంది సురేష్ పాల్గొన్నారు.