విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో మెనూను తప్పక పాటించాలి
26-02-2026 12:49 AM
ఎమ్మెల్యే బిఎల్‌ఆర్
వేములపల్లి, ఫిబ్రవరి 25: విద్యార్థులకు అందజేసే మధ్యాహ్న భోజనంలో తప్పక మెనూ పాటించాలని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. మండల పరిధిలోని ఆమనగళ్లు గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆకస్మికంగా ఎమ్మెల్యే సందర్శించారు. విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థులు మధ్యాహ్న భోజనాలు బాగుండటం లేదని తెలియజేయడంతో సంబంధిత అధికారులకు ఫోన్ చేసి వెంటనే మెస్ ఇంచార్జ్, వంట వారిని మార్చాలన్నారు. విద్యార్థులు ఎమ్మెల్యేకు సంతోషంతో కృతజ్ఞతలు తెలియజేసారు. ఈయన వెంట గ్రామ సర్పంచ్ సందీప్, లక్ష్మీదేవి గూడెం సర్పంచ్ భరత్, కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు




