calender_icon.png 22 November, 2025 | 11:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

22 ఏళ్ల తర్వాత కలుసుకున్న 2003 టెన్త్ బ్యాచ్ విద్యార్థులు

10-02-2025 12:00:00 AM

కొండాపూర్, ఫిబ్రవరి 9: పేగు  బంధం కాదు రక్త బంధం అసలే కాదు ఎవరు ముడి వేయ కుండా ముడిపడిన బంధం ఇది 2002 2003 పూర్వ విద్యార్థుల స్నేహబంధం అని పూర్వ విద్యార్థులు అన్నారు. ఆదివారం కొండాపూర్ మండలం లోని అనంతసాగర్ లోని సత్య వివాహా వేదిక లో 22వసంతాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి హాజరైన్నారు.

కొండాపూర్ మండల పరిషత్ అధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ తాను పనిచేసిన పాఠశాలలో విద్యార్థులంతా 22 ఏళ్ల తర్వాత అనంత సాగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలాలో 2002=2003 పదవ తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థులు ఒకే చోట కలవడం ఆనందంగా ఉందన్నారు .

తమ స్కూల్ డేస్ జ్ఞాపకాలతో చిన్నపిల్లల్లా మారి పాటలకు గెంతులేసి ఆనందం లో మునిగి తేలారు. తమకు చదువులు చెప్పిన  గురువులకు శాలువాలతో పూల మాలలు వేసి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు నాగభూషణం,రవి, మానయ్య, ఆనందం, కృష్ణయ్య, వినోద్, చంద్రయ్య,బక్కయ్య, అశోక్, ఆగమయ్యా,  పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.