calender_icon.png 15 July, 2025 | 11:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బస్సుల కోసం విద్యార్థుల ధర్నా

15-07-2025 12:00:00 AM

చేవెళ్ల, జూలై 14 : ఉదయం, సాయంత్రం వేళల్లో బస్సులు అందుబాటులో లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా మని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. సో మవారం బస్సులు పెంచి, సమయపాలన పాటించాలని కోరుతూ చేవెళ్ల మండలం క మ్మెట ఎక్స్ రోడ్డుపై ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థి నాయకులు మా ట్లాడుతూ..

బస్సులు లేకపోవడంతో సమయానికి పాఠశాలలు, కళాశాలలకు చేరలేక పోతున్నామని, క్లాసులు మిస్సవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీ అధి కారులకు పలు మార్లు విన్నవించినా పెడచెవిన పెడుతున్నారని, ఇప్పటికైనా స్పందించి సమస్యలను పరిష్కరించాలని కోరారు.

విద్యార్థులు రోడ్డుపై బైఠాయించడంతో కిలో మీటర్ మేర భారీగా ట్రాఫిక్ జామైంది. ధ ర్నాలో విద్యార్థి నాయకులు తాటికొండ కరుణాకర్ గౌడ్, శివ, శ్రీకాంత్ రెడ్డి, నితీష్ రెడ్డి, హరికృష్ణ, మునివర్, జస్వంత్ తదితరులుపాల్గొన్నారు.