14-07-2025 11:42:33 PM
హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్..
హనుమకొండ (విజయక్రాంతి): సోమవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్ లో ప్రజావాణి కార్యక్రమాన్ని జిల్లా అధికారులతో కలిసి కలెక్టర్ నిర్వహించారు. ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్(District Collector Sneha Shabarish) ప్రజలు అందించిన అర్జీలను స్వీకరించారు. ప్రజలు తమ సమస్యలను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కు విన్నవించారు. తమ తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జిల్లాకు చెందిన ప్రజలు 206 అర్జీలను అందజేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ.. వచ్చిన అర్జీలను సంబంధిత శాఖల అధికారులు త్వరగా పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు అందించిన అర్జీలను పరిష్కరించడంలో అధికారులు ఆలస్యం చేయొద్దన్నారు. ప్రజావాణి అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి వై.వి. గణేష్, డిఆర్డీవో మేన శ్రీను, హనుమకొండ పరకాల ఆర్డీవోలు రాథోడ్ రమేష్, డాక్టర్ కే. నారాయణ, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.