23-01-2026 04:16:09 PM
నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మండలంలోని పల్లెబోగుడు తండా,ధర్మారెడ్డి,గోపాల్పేట్ గ్రామాలలో గల ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులందరూ మాతా సరస్వతి ఆశీస్సులతో విజయం సాధించాలని సర్పంచులు ధనావత్ పార్వతి శంకర్, లక్ష్మీనారాయణ, వంశీకృష్ణ గౌడ్ ఆకాంక్షించారు. శుక్రవారం పల్లెబోగుల తండా, ధర్మారెడ్డి, గోపాల్ పేటలోని తెలంగాణ మోడల్ స్కూల్లో జరిగిన వసంత పంచమికి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచులు మాట్లాడుతూ... విద్యార్థులు కష్టపడి చదివి వారి కుటుంబాలకు పేరు,కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని సూచించారు.
గోపాల్పేట్లోని మోడల్ స్కూల్లో కొత్త ప్రిన్సిపాల్ రామ్ ప్రసాద్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత, మోడల్ స్కూల్లో సంస్థలో తీవ్రమైన మార్పు వచ్చిందని గోపాల్పేట్, నాగిరెడ్డిపేట గ్రామ సర్పంచ్లు వంశీకృష్ణ గౌడ్, మన్నే వెంకటి ప్రస్తావించారు. తల్లిదండ్రులకు సమాజానికి ప్రభుత్వ పాఠశాలలపై ఎక్కువ అంచనాలు, నమ్మకం ఉందనీ సర్పంచులు పేర్కొన్నారు. ధర్మారెడ్డి, పల్లె పోగుల తండా ప్రభుత్వ పాఠశాలలో గోపాల్పేట్ మోడల్ స్కూల్లో గణేష్ మరియు సరస్వతి ఘనంగా పూజలు చేశారు.
గోపాల్ పేటలోని మోడల్ స్కూల్ను బలోపేతం చేయడానికి అన్ని రకాల మద్దతు మరియు సేవలను అందిస్తాన్ని గోపాల్పేట్, నాగిరెడ్డిపేట సర్పంచ్లు వంశీకృష్ణ గౌడ్,మన్నే వెంకటి హామీ ఇచ్చారు.ఇంగ్లీష్ మీడియంలో నాణ్యమైన విద్యను అందించడానికి సంస్థకు మద్దతు ఇస్తానని హామీ ఇచ్చారు.మెడల్ స్కూల్ పాఠశాలకు వెళ్లే రోడ్డు పక్కన ఉన్న ముండ్ల పొదలను, పిచ్చి చెట్లను తొలగించమని ప్రిన్సిపాల్ చేసిన అభ్యర్థన మేరకు,సర్పంచ్లు వెంటనే జెసిబిని రప్పించి, పొదలను తొలగించారు. ఈ సందర్భంగా మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ రాంప్రసాద్ ఇద్దరికీ కృతజ్ఞతలు తెలిపారు. నూతనంగా ఎన్నికైన సర్పంచులు వంశీ కృష్ణ గౌడ్,మన్నె వెంకట్లను శాలువాలతో సత్కరించారు.
గోపాల్ పేటలోని మోడల్ స్కూల్ను రాష్ట్రంలోని ఉత్తమ సంస్థలలో ఒకటిగా తీర్చిదిద్దడానికి తాను మరియు తన బృందం సాధ్యమైనంత ఉత్తమంగా కృషి చేస్తామని ప్రిన్సిపాల్ రాంప్రసాద్ పేర్కొన్నారు. మోడల్ స్కూల్ సంస్థపై నమ్మకం ఉంచినందుకు తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే జనార్దన్ గౌడ్, సర్పంచులు ధనావత్ పార్వతి శంకర్, లక్ష్మీనారాయణ, వంశీకృష్ణ గౌడ్, మన్నే వెంకటి, బొల్లారం గ్రామ సర్పంచ్ ప్రభు గౌడ్, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు విద్యార్థులు హాజరయ్యారు.