calender_icon.png 3 August, 2025 | 11:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులకు అవగాహన పెంచాలి

31-07-2025 12:23:01 AM

- ప్రతి ఒక్కరు అమ్మ పేరుతో రెండు మొక్కలు నాటి సంరక్షించాలి 

- అడవుల పెంపకంలో సీడ్ బాల్స్ ప్రముఖ పాత్ర 

- రాష్ట్ర, అటవీ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ

రంగారెడ్డి, జులై 30( విజయక్రాంతి): ప్రతి ఒక్కరూ మొక్కలను నాటి పర్యావరణా న్ని కాపాడాలని, విద్యార్థి దశ నుండే పర్యావరణ సంరక్షణ పై, పచ్చదనం వలన కలిగే ప్రయోజనాలపై విద్యార్థులకు అవగాహన కల్పించా లని రాష్ట్ర అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ సూచించారు. బుధవారం మ హేశ్వరం నియోజకవర్గం కందుకూరు మం డలం గుమ్మడివల్లి ఫారెస్ట్ ఏరియా లో సీడ్ బాల్స్ వేసే కార్యక్రమంలో రాష్ట్ర అ టవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ ముఖ్య అతిధిగా పాల్గొని సీడ్ బాల్స్ వేశారు.

ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ సీడ్ బాల్ తయారీ పురాతన కాలం నాటిద ని, జపాన్ లో సీడ్ బాల్ తయారీ విధానం ఉండేదని, విత్తన బంతులను బంక మట్టి, కంపోస్ట్ వంటి వాటితో కలిపి బంతులుగా తయారు చేస్తార ని, అడవులలోని ఖాళీ ప్రదేశాలలో, మనుషులు, వాహనాలు వెళ్లని ప్రాంతాల్లో ఈ విత్త న బంతులను విసిరితే చాలు వాటిలో ఉన్న విత్తనాలు మొలకెత్తుతాయని అన్నారు. ఇది సహజంగా మొక్కలు పెరిగేలా చేస్తుందని, రసాయన ఎరువులు వాడాల్సిన అవసరం ఉండదు, వాటికవే మొక్కలు మొలకెత్తుతాయని తెలిపారు.

స్థా నిక విత్తనాలు, బంకమట్టి, కంపోస్ట్ మిశ్రమంతో తయారు చేయబడిన విత్తన బంతు లను (సీడ్ బాల్స్) బహిరంగ ప్రదేశాలు, బంజరు ప్రాంతాలలో చల్లెందుకు వినియోగించేవారని ఆమె పేర్కొన్నారు. విరివిగా చెట్లను నాటడం వలన అడవిని, పర్యావ రణాన్ని కాపాడుకోవచ్చని అన్నారు. రాష్ట్రమంతట ప చ్చదనం పెంపొందించేలా ప్రతి ఒక్కరూ చెట్లను నాటలని అన్నారు. చెట్లను పెంచడం ద్వారా మనల్ని మనం రక్షించుకోవడం జరుగుతుందని, జీవవైవిధ్యన్ని కాపాడు కోగలు  గుతామని ఆమె పిలుపునిచ్చారు.

చెట్లను పెంచడం ద్వారా వర్షాలు సకాలంలో కూరుస్తాయని, వంద శాతం మొక్కలు నాటేం దుకు కృషి చేయాలని, భౌగోళిక పరిస్థితి మెరుగుపడే విధంగా రాష్ట్రమంతా విరివిగా వనా లను పెంచాలని, అందుకు అందరూ భాగస్వాములు కావాలని అన్నారు. ప్రతి ఒక్కరూ అమ్మ పేరుతో మొక్కలు నాటలని పిలుపునిచ్చారు. ప్రతీ ఇంట్లో కనీసం రెండు మొక్కలు నాటాలని, మీ పిల్లల్లాగే నాటిన మొక్కలను సంరక్షిస్తే తెలంగాణ రాష్ట్రమంతా పచ్చదనంతో నిండిపోతుందని అన్నారు. కార్యక్రమంలో పల్లవి గ్రూప్ ఆఫ్ స్కూల్స్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విద్యార్థులను భాగస్వాములను చేయడం ఎంతో సంతోషంగా ఉందని, పిల్లలకు చిన్నతనం నుండే ప్రకృతి పట్ల, పర్యావరణ పరిరక్షణ పై అవగాహన కలిగించాలని తెలిపారు.

ఇది చాలా మంచి కార్యక్రమమ ని, పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తొ డ్పడాలని పిలుపునిచ్చారు. ఓపెన్ ఫారెస్ట్లో చెట్లను నాటడం కష్టంగా మారినప్పుడు ఈ సీడ్ బాల్ కార్యక్రమం బా గా పని చేస్తుందన్నారు. పర్యావరణానికి మేలు చేసే ఇలాంటి కార్యక్రమాలు అవసరం అని ఇలాంటి కార్యక్రమాల్లో అందరూ భాగస్వామ్యం కావాలని సూచించారు. అనంతరం మంత్రి విద్యార్థులతో, స్థానిక ప్రజాప్రతినిధులతో, అధికారు లతో కలిసి విత్తన బంతులను గుమ్మడివల్లి ఫారెస్ట్ ఏరియాలో వేశారు. కార్యక్రమంలో మంత్రి వెంట చీఫ్ కనస్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ ప్రియాంక వర్గీస్, కందుకూరు ఆర్డీఓ జగదీశ్వర్ రెడ్డి, జిల్లా అటవీ శాఖ అధికారి సుధా కర్ రెడ్డి, స్థానిక ప్రజా ప్రతినిధులు, పల్లవి గ్రూప్ ఆఫ్ స్కూల్స్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వి ద్యార్థులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.