31-07-2025 12:22:55 AM
మిర్యాలగూడ ఎమ్మెల్యే బీఎల్‌ఆర్
మిర్యాలగూడ, జూలై 30: ప్రజల సమస్యల పరిష్కారమే ప్రధాన ఏజెండాగా నిర్వహిస్తున్న ప్రత్యేక ప్రజా వాణి కార్యక్రమం ద్వారా అధికారుల్లో జవాబు దారి తనం పెరుగుతుందని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి( బి ఎల్ ఆర్ ) అన్నారు. బుధవారం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే ప్రత్యేక ప్రజావాణి కార్యక్రమంలో సబ్ కలెక్టర్ నారాయణన్ అమిత్ మాలేపాటి, వివిధ శాఖల ఉన్నతాధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లా డుతూ ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో రైతులకు అవసరమైన యూరియా కొరత రాకుండా అధికారు లు నిరంతరం పర్యవేక్షణ చేయాలన్నారు.
ప్రతి బుధవారం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే ప్రత్యేక ప్రజావాణి కార్యక్రమంలో నియోజకవర్గంలో గల అన్ని మండలాల్లోని ప్రజలు వివిధ సమస్యలపై అర్జీలు సమర్పిస్తారని, వాటిని 15 రోజుల్లోగా పరిష్కరించే విధంగా కృషి చేయాల న్నారు. అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రజా, రైతు సమస్యల పరిష్కారం కొరకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో మిర్యాలగూడ డిఎస్పి రాజశేఖర్ రాజు. ఎం వి ఐ వీరస్వామి. ఇన్చార్జి ఏ డి ఏ ధీరావత్ సైదా నాయక్. ఎంపీడీవో శేషగిరి శర్మ. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డి.వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.