విద్యార్థులకు మెరుగైన విద్యను అందించాలి
ఐటీడీఏ పీఓ యువరాజ్ మార్మట్
ఉట్నూర్, మార్చి 12 (విజయక్రాంతి): గిరిజన విద్యార్థులకు మెరుగైన విద్యను అందిం చాలని, వారికి అర్థమయ్యే రీతిలో విద్యను బోధించాలని ఐటీడీఏ పీవో యువరాజ్ మా ర్మట్ అన్నారు. గురువారం నార్నూర్ మం డలం గిరిజన ఆశ్రమ పాఠశాల జామడ దిశ మెడల్ స్కూల్‌ను పీవో సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడుతూ... ఏమైనా సమస్యలు ఉన్నాయా, సమయానికి, మెనూ ప్రకారంగా భోజనాలు అందిస్తున్నారా లేదా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.
ఆశ్రమ పాఠ శాలలో విద్యార్థులకు వండిన భోజనం రుచి చూశారు. కంప్యూటర్ ల్యాబ్‌ను పరిశీలించా రు. ఐటీడీఏ ద్వారా ప్రవేశపెట్టిన యాప్ పని తీరుపై ఆరా తీశారు. అనంతరం పదో తరగతి విద్యార్థులను సబ్జెక్టులు వారుగా ప్రశ్నలు అడిగి తెలుసుకున్నారు. ప్రతి విద్యార్థికి చదవడం, రాయడం తప్పనిసరిగా రావాలని ఉపాధ్యాయులకు సూచనలు చేశారు.




