02-05-2025 11:32:25 PM
కలెక్టర్ వెంకటేష్ ధోత్రే
కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని, వాటిని సాధించే దిశగా ఏకాగ్రత, పట్టుదలతో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ లో అదనపు కలెక్టర్ దీపక్ తివారి, సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లా, ఎమ్మెల్యే కోవ లక్ష్మి లతో కలిసి ఆసిఫాబాద్ మండలం గుండి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మొట్టమొదటి బ్యాచ్ విద్యార్థులు 10వ తరగతిలో ఉత్తీర్ణులైన సందర్భంగా విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విద్యా రంగ అభివృద్ధి అనేక చర్యలు తీసుకుంటుందని, ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకొని ఉన్నత విద్యను అభ్య-సించాలని తెలిపారు. మొట్టమొదటి బ్యాచ్ 10వ తరగతిలో ఉత్తీర్ణత సాధించడం అభినందనీయ-మని, ఇదే స్ఫూర్తితో విద్యార్థులు ఉన్నత లక్ష్యాల సాధన దిశగా కృషి చేయాలని తెలిపారు. అనం-తరం పరీక్షలలో ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించిన విద్యార్థులను శాలువాలతో సత్కరిం-చారు. ప్రభుత్వ పాఠశాలలను చదివి ఉత్తమ మార్కులు సాధించి అందరికీ ఆదర్శంగా నిలిచా-రని, భవిష్యత్తులో మంచి స్థానాన్ని సాధించి ఉన్నతంగా ఎదగాలని అన్నారు.ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.