04-08-2025 12:26:27 AM
జేఎన్ టీయూహెచ్ వైస్ ఛాన్స్‌లర్ కిషన్ కుమార్
ఘట్ కేసర్, ఆగష్టు 3 : విద్యార్థులు ఛా లెంజ్ లను అధిగమించేలా టెక్నికల్, క మ్యూనికేషన్ స్కిల్స్ ను పెంపొందించుకుం టూ టెక్నాలజీని అందిపుచ్చు కోవాలని జెఎ న్ టీయూహెచ్ వైస్ ఛాన్సలర్ టి. కిషన్ కు మార్ అన్నారు. పోచారం మున్సిపల్ దివ్యానగర్ లోని నల్ల మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళా శాలలో గ్రాడ్యుయేషన్ డే-2025 వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈకార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన వైస్ చాన్సలర్ కిష న్ కుమార్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన విద్యార్థులకు ఇంజనీరింగ్ పట్టా ప్రధానం చేశారు. వారిని అభినందిస్తూ ఈసందర్భంగా ఆయ న మాట్లాడుతూ ప్రస్తుత ప్రపంచంలో ఎప్పటికప్పుడు తమ మేధస్సుకు, విజ్ఞానాన్ని. టెక్నాలజీని అందిపుచ్చుకుంటే విజయం సు లువవుతుందన్నా రు. కష్టించే తత్వం, పరిస్థితులకు శ్రమించే వారిదే భవిష్యత్ అన్నారు.
జెఎన్ టీయూలో కూడా పలు సంస్కరణలు చేపట్టామని, విద్యార్థుల భవిష్యత్ కోసం జ న్మనీ యూనివర్సిటీలతో ఒప్పందం జరిగిందని తదనుగుణంగా మాస్టర్ డిగ్రీ చేసే వీలుంటుందని చెప్పారు. విద్యార్థుల కోసం అహర్నిశలు శ్రమిస్తూ వారిని ఇంజనీరింగ్ పట్టభద్రులుగా మార్చిన వారి తల్లిదండ్రులను అభినందించారు. విద్యార్థుల భవిష్యత్ కోసం కళాశాల అవలంభిస్తున్న విధానాన్ని, మౌళిక సదుపాయాలను కొనియాడారు.
అనంతరం కళాశాలలో ఏర్పాటు చేసిన ఐడియా ల్యాబ్ ను ప్రారంభించారు. కళాశాల చైర్మెన్ సంధ్యావళి కేతిరెడ్డి విద్యార్థుల ను వారి తల్లిదండ్రులను అభినందించారు. సెక్రటరీ నల్ల మల్లారెడ్డి మాట్లాడుతూ ఇంజనీరింగ్ విద్యార్థులకు ఆంగ్ల భాష పరిజ్ఞానం, సాంకేతికతతో పాటు బాధ్యతలు ముఖ్యమని తెలిపారు. ఈసందర్భంగా ఇంజనీరింగ్ పట్టభద్రలచే ప్రతిజ్ఞ చేయించారు.
కళాశాల డైరెక్టర్ డాక్టర్ దివ్య నల్ల విద్యార్థులకు అత్యుత్తమ శిక్షణను అందిస్తున్నామని తెలిపారు. ట్రెజరర్ డాక్టర్ స్నేహ నల్ల పట్టా సాధించిన విద్యార్థులు మరింత బాధ్యతగా మెలగాలన్నారు. ఈకార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.ఎన్.వి. రమేష్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎ. రాజశేఖర్, వివిధ శాఖల హెచ్‌ఐడీలు, అధ్యాపకులు పాల్గొన్నారు.