04-08-2025 12:27:42 AM
ఎల్బీనగర్, ఆగస్టు 3 : హయత్ నగర్ డివిజన్ లోని పాత రోడ్ అనుమగల్ లో ఆదివారం పారిశుధ్య కార్మికులకు వ్యక్తిగత సంరక్షణ పరికరాల కిట్లను కార్పొరేటర్ నవజీవన్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రజలకు సీజనల్ వ్యాధులు రాకుండా మన ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచే విషయంలో ప్రధాన భూమికను పారిశుధ్య కార్మికులు పోషిస్తున్నారని అన్నారు.
కార్మికుల ఆరోగ్య పరిరక్షణనే ధ్యేయంగా ఆరోగ్య సంరక్షణ కొరకు పరికరాల కిట్లను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. పారిశుధ్య కార్మికులు తమ విధులను నిర్వహించడంలో నిర్లక్ష్యం వహించకూడదని, మీకు ఏ సమస్య వచ్చిన నా దృష్టికి తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో శానిటేషన్ సూపర్ వైజర్ యాదయ్య, బీజేపీ సీనియర్ నాయకుడు సంఘీ అశోక్, బీజేపీ డివిజన్ ప్రధాన కార్యదర్శి ఎర్రవెలి సత్యనారాయణ తదితరులుపాల్గొన్నారు.