calender_icon.png 23 July, 2025 | 2:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులు చదవడం, రాయడంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి

23-07-2025 12:00:00 AM

కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

వేములవాడ టౌన్:జూలై 22(విజయక్రాంతి): పాఠశాలలోని ప్రతి విద్యార్థి చదవడం రాయడంపై ఉపాధ్యాయులు ప్రత్యేకశ్రద్ధ పెట్టాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. వేములవాడ అర్బన్ మండలం చీర్లవంచ గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, జి ల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను కలెక్టర్ మంగళవారం అకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా ప్రతీ తరగతి గదిని సందర్శించి, విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలు, మౌలిక వసతులు, విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు, విద్యార్థులకు ఉపాధ్యాయులు పాఠాలు బోధిస్తున్న తీరును పరిశీలించారు. ప్రతీ తరగతి గదిలో ఎంత మంది విద్యార్థులు ఉన్నారు? ఎవరైనా దీర్ఘకాలికంగా పాఠశాలకు గైర్హాజరు అవుతున్నారా అనే వివరాలను ఆరా తీశారు. అనంతరం కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడారు.

ప్రతీ విద్యార్థికి సక్రమంగా చదవడం, రాయడం వచ్చేలా ప్రత్యేక శ్ర ద్ధ వహించాలని ఉపాధ్యాయులకు సూచించారు.మధ్యాహ్న భోజనం తప్పనిసరిగా గ్యాస్ సిలిండర్ పైన తయారు చేయాలని ఆదేశించారు.జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గ్యాస్ సిలిండర్ ఇంకా రాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

పాఠశాల ఆవరణలో, ప్రహరీ వెంట మొక్కలు నాటించాలని పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు. విద్యార్థులకు సరిపడా కంటే ఎక్కువగా అందుబాటులో ఉన్న డెస్క్ లను అవసరం ఉన్న పాఠశాలలకు పంపించాలని సూచించారు.