calender_icon.png 24 July, 2025 | 2:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్య, దృఢ సంకల్పం, వినయమే విద్యార్థుల ఉన్నతికి మూలం

23-07-2025 12:00:00 AM

పూర్వ తానా అధ్యక్షులు తాళ్లూరి జయ శేఖర్

భద్రాచలం, జులై 22, (విజయ క్రాంతి):విద్యార్థులు జీవితంలో రాణించాలంటే విద్య, దృఢ సంకల్పం, వినయ గుణాలే మూలం అని తానా పూర్వ అధ్యక్షులు తాళ్లూరి జయ శేఖర్ అన్నా రు.భద్రాచలంలోని రాజుపేటలో మోడల్ స్కూల్ ‘ప్లే పార్క్‘ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరై అంతర్జాతీయంగా వస్తున్న శాస్త్ర సాంకేతిక రంగాలలోని మార్పులను సశాస్త్రీయంగా అధ్యయనం చేసి మానవాళి అభివృద్ధికి యువత కృషి చేయాలని కోరారు.

ఏదైనా సాధించాలంటే దృఢ సంకల్పం అవసరమని దానికి క్రికెటర్ యశస్వి జైస్వాల్ ఎదిగిన తీరును స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు. ఎదిగిన కొద్ది ఒదిగి ఉండే లక్షణమే సంపూర్ణ వికాసానికి దారితీస్తుందని అ న్నారు.మీ సమావేశంలో తాళ్లూరి పంచాక్షరయ్య చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ తాళ్లూరి పంచాక్షరయ్య మాట్లాడుతూ విద్యార్థులు విద్యతోపాటు సత్యం, ధర్మం, న్యాయం మార్గాలలో నడవాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో తాళ్ళూరి పంచాక్షరయ్య చారిటబుల్ ట్రస్ట్ డైరెక్టర్ వల్లూరిపల్లి వంశీకృష్ణ, కవి చిగురుమల్ల శ్రీనివాస్, పాఠశాల కరస్పాండెంట్ ఉషారాణి, దుమ్ముగూడెం ఎంఈఓ సున్నం సమ్మయ్య, శ్యామ్, ప్రభాకర్, లక్ష్మీ, లీలావతి, సిద్ధులు, మాధవరెడ్డి, అశోక్, లలితతో పాటు పాఠశాల తల్లిదండ్రులు పాల్గొన్నారు.