24-01-2026 02:04:57 PM
ఆయుష్మాన్ భారత్ సేవల అమలుపై ఆరా
కల్వకుర్తి జనవరి 24: నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శనివారం జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఓపీ నమోదు విభాగం, ల్యాబొరేటరీ, ఇన్‌పేషెంట్ వార్డు సహా ఇతర విభాగాలను పరిశీలించారు. ఆసుపత్రిలో పనిచేస్తున్న వైద్యులు, సిబ్బంది హాజరు వివరాలు, రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు నాణ్యమైన వైద్యం అందేలా అన్ని ఏర్పాట్లు సక్రమంగా ఉండాలని ఆదేశించారు.
ఆయుష్మాన్ భారత్ పథకం కింద అందిస్తున్న వైద్య సేవల అమలు తీరుపై ఆర తీశారు .ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి అవసరమైన నూతనంగా నిర్మిస్తున్న భవనాలను పరిశీలించి వెంటనే పూర్తి చేసి ఆసుపత్రిని పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలని డీఎంహెచ్వోను ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాడని ప్రభుత్వాసుపత్రి వైద్యుల ప్రథమ కర్తవ్యం అని కలెక్టర్ తెలిపారు. జిల్లా కలెక్టర్ వెంట నాగర్ కర్నూల్ డిఎంహెచ్ఓ డాక్టర్ రవి కుమార్, వెల్దండ తహసిల్దార్ కార్తీక్ కుమార్ ఇతర వైద్యులు సిబ్బంది తదితరులు ఉన్నారు.