calender_icon.png 24 January, 2026 | 4:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సింగరేణిపై ఏ గద్దని వాలనివ్వ

24-01-2026 01:38:53 PM

టెండర్లపై విచారణకు సిద్ధం.

అడ్డగోలుగా ఏదిపడితే అది రాస్తే నడవదు.

హైదరాబాద్: సైట్ విజిట్ అనే నిబంధన దేశంలో ఎక్కడా లేదన్నట్లుగా దుష్ప్రచారం చేశారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) ఫైర్ అయ్యారు. టెండర్లు రద్దు చేయకపోతే ప్రజల్లో అపోహలు పెరుగుతాయని వెంటనే రద్దుకు ఆదేశించానని వివరించారు. నైనీ కోల్ బ్లాక్ కు బీఆర్ఎస్ హయాంలోనే టెండర్లు పలిచారని వెల్లడించారు. సింగరేణిలో మొత్తం 25 కాంట్రాక్టులు జరిగితే 20 టెండర్లు బీఆర్ఎస్ హయాంలోనే జరిగాయని సూచించారు. గతంలో కాంగ్రెస్ లో ఉన్న సృజన్ రెడ్డిని బీఆర్ఎస్ లో చేర్చుకున్నది వాళ్లే అన్నారు. కాంట్రాక్టులు ఇస్తామని ఆశపెట్టి సృజన్ రెడ్డిని బీఆర్ఎస్ లో చేర్చకున్నారని ఆరోపించారు.

సృజన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డితో ఎలాంటి సంబంధం లేదన్నారు. కల్యాణఖని ఓపెన్ టెండర్ దక్కించుకున్నది ఆర్. విద్యాసాగర్ రావు సంస్థ.. ఆర్ జీ ఓసీ-2 టెండర్ దక్కించుకున్నది సీ-5 ఇంజినీరింగ్ సంస్థ అన్నారు. సీ-5 ఇంజినీరింగ్ డైరెక్టర్లు నిశాంత్ రావు, మదన్ మోహన్ రావు బీఆర్ఎస్ నేతల బంధువులే అన్నారు. ఎస్ఆర్ పీ-ఓపీ2 టెండర్ సంస్థ దక్కించుకున్నది హర్ష కంపెనీ అని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో వేసిన 5 టెండర్లలో 4 టెండర్లను బీఆర్ఎస్ నేతలే దక్కించుకున్నారని తెలిపారు. పారదర్శక టెండర్ల వల్లే బీఆర్ఎస్ నేతలు కూడా టెండర్లు పొందగలిగారని చెప్పారు.

తెలంగాణ ఆస్తులు పరిరక్షించడం నా బాధ్యత అన్న భట్టి విక్రమార్క సింగరేణి ప్రాంతంలో మండుటెండర్లో పాదయాత్ర చేశానని గుర్తుచేశారు. మంచి క్యాలిటీ ఉన్న బొగ్గు గనులను సింగరేణి సంస్థ దక్కించుకునేలా కృషి చేస్తున్నామని వెల్లడించారు. సింగరేణి సంస్థ కేవలం బొగ్గుకే పరిమితం చేయకుండా కీలక ఖనిజాల మైనింగ్ చేపట్టేలా చేస్తున్నామని పేర్కొన్నారు. 14 ఏళ్లలో జరిగిన టెండర్లపై ఎంక్వైరీ జరపాలా? 2014 నుంచి ఇప్పటివరకు జరిగినవన్నీ బయటకు తీద్దామన్నారు. తాడిచర్ల నుంచి నైనీ వరకు అన్నింటిపై దర్యాప్తు చేద్దామని చెప్పారు.

సీఎం రాగానే చర్చించి విచారణకు ఆదేశిస్తామన్నారు. నేను ఆస్తులు కూడబెట్టడానికి రాజాకీయాల్లోకి రాలేదని భట్టి విక్రమార్క పునురుగ్ఘటించారు.  సమాజంలో మార్పు కోసం పరితపించి రాజకీయాల్లో వచ్చా అన్నారు. సీఎం ఆదేశాలతో దేశంలోనే తొలిసారి కులగణన చేశామని తెలిపారు. చిన్న పొరపాటు కూడా జరగకుండా కులగణన పూర్తి చేశామని వివరించారు. బొగ్గు బావుల్లో ఏ రాబందులను వాలనివ్వనని స్పష్టం చేశారు. హరీశ్ రావు అసలు ఏం కావాలి? అని ఆయన ప్రశ్నించారు. మీకు ఎంక్వైరీ కావాలంటే నాకే లేఖ రాయొచ్చని సూచించారు.