calender_icon.png 13 August, 2025 | 7:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టపడి చదవాలి: ఎస్సై మధుసూదన్

13-08-2025 06:16:05 PM

కల్హేర్ (విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా(Sangareddy District) కల్హేర్ మండల పరిధిలోని బాచేపల్లి మినీ గురుకులానికి ఎస్సై మధుసూదన్ రెడ్డి(SI Madhusudhan Reddy) సందర్శించారు. ఈ సందర్బంగా ఎస్సై విద్యార్థులతో మాట్లాడుతూ... ప్రతి ఒక విద్యార్ధి కష్టపడి కాకుండా ఇష్టపడి చదువుకోవాలన్నారు. తల్లిదండ్రులకు మంచిపేరు తీసుకొనిరావాలని అన్నారు. అలాగే ప్రతి విద్యార్థికి ఎస్సై చేతులమీదుగా దుప్పట్లను అందించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ కవిత, పోలీస్ సిబ్బంది  లక్ష్మణ్, సాయి ప్రసాద్, అధ్యాపకాబృందం పాల్గొనడం జరిగింది.