13-08-2025 06:13:49 PM
నిర్మల్ (విజయక్రాంతి): భారతదేశంలో వ్యవసాయ ఉత్పత్తి రంగాల్లో విదేశీ ఎమ్మెల్సీ కార్పొరేట్ వ్యవస్థ రుద్దడాన్ని నిరసిస్తూ భారత సంయుక్త మోర్చా ఆధ్వర్యంలో బుధవారం నిర్మల్ లో నిరసన తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయం వద్ద అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేసి వారి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. వ్యవసాయ ఉత్పాదకరంగాలు ప్రైవేటు పెట్టుబడులను ఆహ్వానించడం వల్ల దేశంలో రైతులకు తీవ్ర నష్టం జరుగుతుందని ప్రభుత్వం వెంటనే దీన్ని అడ్డుకోవాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు నందిరామయ్య నూతన కుమార్ రాజన్న గంగన్న రామ్ లక్ష్మణ్ లక్ష్మి గఫూర్ గంగారాం తదితరులు పాల్గొన్నారు.