విద్యార్థులు లక్ష్య సాధనకు శ్రమించాలి
యాదాద్రి భువనగిరి కలెక్టర్ హనుమంత్ కే జండగే
యాదాద్రి భువనగిరి, జూన్ 12 (విజయక్రాంతి): విద్యార్థులు భవిష్యత్తు లక్ష్యాలను నిర్ణయించుకొని, ఆ దిశగా శ్రమించాలని కలెక్టర్ హనుమంత్ కే జండగే అన్నారు. బుధ వారం ఆయన కలెక్టరేట్‌లో రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో పదో తరగతిలో 10 జీపీఏ సాధించిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడు తూ.. పాఠశాల విద్యను పూర్తి చేసుకొని కళాశాలకు వెళ్తున్న విద్యార్థులు సెల్‌ఫోన్‌కు దూరంగా ఉండాలని, మంచి స్నేహితులను ఎంచుకోవాలని సూచించారు. నచ్చిన రంగా న్ని ఎంచుకొని విజయం సాధించడానికి శ్రమించాలని తెలిపారు. కార్యక్రమంలో డీఈవో కే నారాయణ రెడ్డి, రెడ్‌క్రాస్ ప్రతినిధులు ఆర్.మహేందర్ రెడ్డి, జీ లక్ష్మీనరసిం హారెడ్డి, దిడ్డి బాలాజీ, సద్ది వెంకటరెడ్డి, కొడా లి వెంకటేశ్, జంపాల అంజయ్య తదితరులు పాల్గొన్నారు.






