1 July, 2026 | 4:16 AM

ప్రజారోగ్యానికి ప్రాధాన్యత

13-06-2024 12:32 AM

అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్

వికారాబాద్, జూన్ 12 : రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్యానికి ప్రాధాన్యత ఇస్తుందని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం మోమిన్‌పేట్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరో గ్య కేంద్రం భవనాన్ని జెడ్పీ చైర్‌పర్సన్ సుని తా మహేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ సీ నారాయణ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సం దర్బంగా మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన మాట ప్రకా రం ఆరోగ్యశ్రీ పథకాన్ని రూ. 5 లక్షల నుండి రూ. 10 లక్షలకు పెంచామన్నారు. పేదలకు ఎలాంటి అనారోగ్యం వచ్చినా రూ. 10 లక్ష ల వరకు కార్పోరేట్ ఆసుపత్రిలో ఉచిత వైద్యం చేసుకోవచ్చునని తెలిపారు. వికారాబాద్ నియోజకవర్గంలోని ప్రజలకు సకాలం లో వైద్యం అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. డీఎంహె చ్‌ఓ పాల్వన్ కుమార్, ఆర్డీఓ వాసుచంద్ర పాల్గొన్నారు.