calender_icon.png 12 May, 2025 | 11:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వ్యాయామం.. @ ఆరోగ్యం...

11-05-2025 11:32:00 PM

భద్రాద్రి కొత్తగూడెం/ఖమ్మం,(విజయక్రాంతి): ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో ప్రతి ఒక్కరికి వ్యాయామం తప్పనిసరి అని, పాపులర్ ఛానల్ ఎండి, & రాజ్యాంగ పరిరక్షణ వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు సయ్యద్ సాదిక్ అలి, ఖమ్మం జిల్లా మహిళా ప్రాంగణ అధికారిణి వేల్పుల విజేత అన్నారు. ఖమ్మం జిల్లా కేంద్రంలోని స్లామ్  లైఫ్ స్టైల్  అండ్ ఫిట్నెస్ స్టూడియో ప్రథమ వార్షికోత్సవ వేడుకలో వారు ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు.

గత 20 ఏండ్ల  క్రితం భారతదేశ పౌరుల సగటు వయసు 55 నుంచి 65 ఏండ్ల పరిమితి ఉండేదని, 2025 నాటికి 75 నుంచి 85 ఏండ్ల వరకు పరిమితికి పెరిగిందన్నారు.. రాబోయే కాలంలో  ప్రతి ఒక్కరు ఆరోగ్యం వైపు దృష్టి పెడుతూ... ఆర్గానిక్ ఫుడ్స్ తో  ఫిట్నెస్ కోసం ట్రైనర్ సలహాలతో ప్రతినిత్యం వ్యాయామం పాటిస్తే జపాన్ దేశ పౌరుల కంటే 100 ఏండ్లు  దాటి ఆరోగ్యంగా మన భారతావనిలో జీవించే అవకాశం ఉందన్నారు. వ్యాయామంలో భాగంగానే వాకింగ్, జాగింగ్ లు, శరీర సౌష్టవం కోసం జిమ్ లు ఉన్నాయన్నారు. ఆరోగ్యవంతంగా జీవించాలంటే ఫిట్నెస్ తప్పనిసరి అని అందుకు ఖమ్మం నగర ప్రజానీకం స్లామ్ లైఫ్ స్టైల్ ఫిట్నెస్ స్టూడియో సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 

గత 3 దశాబ్దాలుగా వెంకటేశ్వర్లు, మాధవి లు వ్యాపార దృక్పథంతో కాకుండా సేవా దృక్పథంతోనే అనేక సంస్థలను నెలకొలుపుతున్నారన్నారు. లైఫ్ స్టైల్ అండ్ ఫిట్నెస్ స్టూడియో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు మాస్టర్ ప్రాంచైజీ వెంకటేశ్వర్లు మాధవి దంపతులకు రావడం సంతోషదాయమని వారన్నారు..ఈసందర్భంగా వారిని ప్రత్యేకంగా అభినందించారు. స్లామ్ లైఫ్ స్టైల్ ఫిట్నెస్ స్టూడియోలో తమ విధులలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు అందజేసి వారిని ప్రోత్సహించారు.  ఈ కార్యక్రమంలో స్లామ్ సంస్థ ఏ జీ ఎం అర్జున్, ఫిట్నెస్ ఇన్ స్ట్రక్చర్ మనోజ్, రాజ్యాంగ పరిరక్షణ వేదిక పాలేరు బాధ్యులు డాక్టర్ నజీరుద్దీన్, జర్నలిస్టు జానీపాషా తదితరులు పాల్గొన్నారు.