calender_icon.png 13 May, 2025 | 12:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టీఎస్ ఎఫ్ సెట్ ఫలితాలలో రేస్ ప్రభంజనం..!

11-05-2025 11:35:37 PM

రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించిన విద్యార్థులు

విద్యార్థులను అభినందించిన బాణాల వసంత వెంకటరెడ్డి

కోదాడ: టీఎస్ఎఫ్సెట్ ఫలితాలను ఆదివారం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఇంజనీరింగ్ కోర్సుల, ఫార్మసీ ప్రవేశాల కొరకు మొదటి వారంలో ఎంట్రన్స్ నిర్వహించారు. ఈ ఫలితాలలో కోదాడ పట్టణానికి చెందిన రేస్ ఐఐటి మెడికల్ అకాడమీ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభను కనబరిచి ర్యాంకులు సాధించారు. కళాశాలకు చెందిన తిప్పన రోహిత్ రెడ్డి1302,పోసాని వంశీ1881, పల్లా సూర్య ప్రకాష్ 2976, యలగొండ దీపిక 3125, కట్టమూరి కీర్తన 4410, బాణాల మహా శ్రీ కౌశిక్ 4871,కుసుమ వీక్షిత 4921, జనగం ఓజస్వి 5472, సయ్యద్ హుజాఫ 5956, కొండ చక్రధర్ గౌడ్ 6338, అక్కినేపల్లి గగన్ కుమార్ 6482, కుంటి గొర్ల మణికంఠ 6635, షేక్ అంజుమ్7731, బి.శివజ్యోతి7840, షేక్ సమీర్8656, బానోతు మధు ప్రసాద్ 8934, ఇ. సన్నీ 9688 ర్యాంకులు సాధించారు.

మెడికల్ విభాగం నుండి సన్నపరెడ్డి సిరి 8245, మహమ్మద్ మొహిసిన్ 9745 ర్యాంకులు సాధించారు. ఈ సందర్భంగా విద్యార్థులను విద్యాసంస్థల చైర్మన్ బాణాల వసంత వెంకటరెడ్డి అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాతీయ, మరియు రాష్ట్ర స్థాయి ఎంట్రన్స్ ఫలితాలలో రేస్ విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులు సాధిస్తున్నారని భవిష్యత్తులో మెరుగైన ఫలితాలు సాధించడానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. ఇటీవల ఇంటర్మీడియట్ బోర్డ్ విడుదల చేసిన పరీక్ష ఫలితాలలో కూడా రేస్ కళాశాల నుండి రాష్ట్ర స్థాయి మొదట ర్యాంకు సాధించారని గుర్తు చేశారు. మెరుగైన విద్యను అందించేందుకే నిరంతరం కృషి చేస్తున్నామని , ఉత్తమ ఉపాధ్యాయులతో బోధన చేస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులో కూడా కళాశాల ఎక్కడ రాజీ పడకుండా విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ మరియు అధ్యాపకులు పాల్గొన్నారు.