01-08-2025 12:00:00 AM
మాజీ మంత్రి మల్లారెడ్డి
మేడ్చల్, జూలై 31(విజయ క్రాంతి): విద్యార్థులు బాగా చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని మా జీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి అన్నారు. గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని మైసమ్మగూడలో మల్లారెడ్డి యూనివర్సిటీలో జరిగిన ఓరియంటేషన్ డే 2025 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
యూనివర్సిటీలో అడ్మిషన్స్ తీసుకున్న వి ద్యార్థిని విద్యార్థులకు దేశానిర్దేశం చేశారు.కష్టపడితే ఏదైనా సాధ్యమే అవుతుందన్నారు. మల్లారెడ్డి విద్యాసంస్థల్లో చదివిన వారు దేశ విదేశాల్లో మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారన్నారు. ఈ కార్య క్రమంలో మల్లారెడ్డి యూనివర్సిటీ డైరెక్టర్లు చామకూర మల్లారెడ్డి, చామకూర భద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.