calender_icon.png 10 October, 2025 | 2:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అశ్వాపురంలో సబ్ కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు

10-10-2025 12:08:01 AM

అశ్వాపురం, అక్టోబర్ 9 (విజయక్రాంతి):భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రా చలం రెవెన్యూ డివిజన్ సబ్ కలెక్టర్ మృణా ల్ శ్రేష్ట గురువారం అశ్వాపురం మండలంలోని తహసీల్దార్ కార్యాలయం, ఎంపీడీవో కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేశా రు. కార్యాలయ రికార్డులు, హాజరు పుస్తకాలు, ప్రజా సేవల అమలు విధానాలు, సిబ్బంది హాజరు వంటి అంశాలను సమీక్షించారు. పారదర్శకమైన, సమర్థవంతమైన సేవలందించాలంటూ అధికారులకు సూచనలు చేశారు.

తరువాత ఆయన అశ్వాపురం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల 2025 నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని సందర్శించి పర్యవేక్షించారు. ఈ సందర్భం గా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ, ఎన్నికల కోడ్ అమల్లో ఉంది.

ఎంతటి వారైనా చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్య లు తప్పవు అని హెచ్చరించారు. ఎన్నికల నిబంధనలు కచ్చితంగా పాటించాలని, ఎటువంటి అక్రమాలకు తావులేకుండా అధికారు లు, సిబ్బంది జాగ్రత్తగా వ్యవహరించాలని ఆయన ఆదేశించారు. ఈ తనిఖీ మరియు పర్యవేక్షణ కార్యక్రమంలో సంబంధిత శాఖ ల అధికారులుపాల్గొన్నారు.