calender_icon.png 10 October, 2025 | 8:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సర్కార్ బడుల్లో ఆధార్ స్పెషల్ డ్రైవ్

10-10-2025 12:09:05 AM

భీమిని,  అక్టోబర్ 9 : ప్రభుత్వ పాఠశాలలో ఆధార్ అప్డేషన్ పెండింగ్ ఉన్న విద్యార్థుల కోసం గురువారం స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. అందులో భాగంగా ప్రతి మండలానికి ఓ ఆధార్ ఆపరేటర్‌ను నియమించగా భీమిని మండల కేంద్రానికి కామెర సురేందర్‌ను నియమించారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో ఆధార్ అప్డేషన్ (బయోమెట్రిక్ అప్డేట్) పూర్తి ఉచితంగా చేస్తున్నారు. మండల కేంద్రంలోని ఎంపీపీఎస్ పాఠశాలలో ఆధార్ అప్డేట్ చేసే ప్రక్రియను మండల విద్యాధికారి (ఎంఈఓ) పరిశీలించారు.