14-07-2025 08:47:03 PM
పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు..
అశ్వాపురం (విజయక్రాంతి): పచ్చదనంతోనే పర్యావరణ సమతుల్యత సాధ్యమవుతుందని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు(MLA Payam Venkateswarlu) పేర్కొన్నారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సోమవారం ఫారెస్ట్ శాఖ చేపట్టిన వన మహోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అధికారులతో కలిసి పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణ బాధ్యతను కూడా తీసుకోవాలని సూచించారు. పుట్టినరోజు, వివాహ దినోత్సవం వంటి సందర్భాల్లో గుర్తుగా ఒక మొక్కను నాటి సంరక్షించడం అలవాటుగా చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో తహసిల్దార్ మణిధర్, ఎంపీఓ ముత్యాల రావు, ఎంఈఓ వీరస్వామి, ఎఫ్ఆర్ వో రమేష్, పాక్స్ చైర్మన్ మధుసూదన్ రెడ్డి, హెడ్మాస్టర్ యోగిత వేణి పాల్గొన్నారు.