calender_icon.png 15 July, 2025 | 4:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీసీ కెమెరాల ఏర్పాటుకు 20 లక్షలు మంజూరు చేయాలి

14-07-2025 09:08:04 PM

కాలనీల్లో పోలీసు పెట్రోలింగ్ పెంచాలి..

జిల్లా కలెక్టర్ ను కలిసి విజ్ఞప్తి..

నల్గొండ టౌన్ (విజయక్రాంతి): నల్లగొండ పట్టణంలోని పానగల్లు రోడ్డులో గల 19వ వార్డులోని శ్రీనగర్ కాలనీ, దీపక్ నగర్, ఆదిత్య కాలనీ, ఎన్.జి.ఓస్ కాలనీలలో దొంగల బెడదను అరికట్టడానికై సీసీ కెమెరాల ఏర్పాటు కోసం 20 లక్షల రూపాయలు మంజూరు చేయాలని కోరుతూ నల్లగొండ జిల్లా కలెక్టర్ త్రిపాఠీ(District Collector Ila Tripathi)కి నల్లగొండ మున్సిపల్ మాజీ హ్యాట్రిక్ కౌన్సిలర్ కొండూరు సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ రాతపూర్వకంగా కొండూరు సత్యనారాయణ వివరించారు. 19వ వార్డులోని పైన తెల్పిన కాలనీలతో పాటు అమూల్య కాలనీ, సంజయ్ గాంధీనగర్, 8వ వార్డులోని నందీశ్వర్ కాలనీ, ఎన్.బి.ఓస్ కాలనీ, యు.హెచ్.సి, ఏరియా, 18వ వార్డులోని శ్రీరామనగర్, అలివేలు మంగా పురం, రామక్రిష్ణానగర్లో దొంగల తిరుగుడు పెరిగిందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.

3, 18, 19 వార్డులకి అతి సమీపంలో అద్దంకి బైపాస్, రోడ్డు ఉండడంతో పాటు రైల్వే స్టేషన్ దగ్గరలో ఉండడం వలన దొంగల బెడద తీవ్రంగా ఉందని ఆయన తెలియజేశారు. పోలీసు పెట్రోలింగ్ కూడా ఈ ప్రాంత కాలీలలో పెంచాలని కోరారు.అందుకోసం ఈ కాలనీల ప్రజలు భయబ్రాంతులకు గురికాకుండా దొంగలు తిరిగే సందర్భంలో సిసి కెమెరాల్లో బందించ బడతారు. కాబట్టి జిల్లా కలెక్టర్ అట్టిసిసి కెమెరాల ఏర్పాటు కోసం సిబిఎఫ్ నిధులు గానీ, డిఎంఎస్టి నిధులు గానీ, మున్సిపల్ నిధులుగానీ లేదా పోలీసు డిపార్ట్మెంట్ ద్వారగానే 20లక్షలు మంజూరి చేయాలని వినతి పత్రంలో పేర్కొన్నారు.