calender_icon.png 15 July, 2025 | 12:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నారాయణ విద్యాసంస్థపై చర్యలు తీసుకోవాలి

14-07-2025 08:34:02 PM

నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని బైంసా రోడ్ లో ఉన్న నారాయణ విద్యాసంస్థ(Narayana Educational Institute)పై చర్యలు తీసుకోవాలని నిర్మల్ ట్రస్మా ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ఫిర్యాదు చేశారు. నారాయణ విద్యాసంస్థ ఏలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండానే పదో తరగతి వరకు విద్యాబోధన నిర్మించి విద్యార్థులకు పాత తేదీల్లో టీసీలు బోనాఫైలు అందిస్తుందని కలెక్టర్కు ఆర్డిఓకు వివరించారు. గత సంవత్సరం అనుమతి వచ్చినప్పటికీ అంతకుముందు మూడేళ్ల నుంచి తమ పాఠశాలలో చదువుతున్నట్టు పలువురు విద్యార్థులకు ధృవీకరణ పత్రాలు జారీ చేశారని లక్షలాది రూపాయల ఫీజులు వసూలు చేస్తున్నారని ఫిర్యాదులు పేర్కొన్నారు. దీనిపై ఇప్పటికి రెండుసార్లు ఫిర్యాదు చేయడం జరిగిందని వారు అధికారులకు విన్నవించారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు వెంకటేశ్వరరావు కొత్త కాపు గంగన్న చంద్రప్రకాష్ గౌడ్ పద్మనాభ గౌడ్ సంఘ సభ్యులు ఉన్నారు.