14-07-2025 08:24:26 PM
నిర్మల్ (విజయక్రాంతి): చించోలిలోని తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాల(Telangana Minority Residential School)ను బీఆర్‌ఎస్ పార్టీ మైనార్టీ నాయకులు సోమవారం సందర్శించారు. విద్యార్థులకు దుస్తులు, ఆహారం, పుస్తకాల గురించి చర్చించారు. పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు తమ హయాంలో ప్రభుత్వం మైనారిటీ గురుకులాలను ఏర్పాటు చేయడం జరిగిందని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు ఖాజా అక్రమ్ అలీ, మసూద్ అలీ ఖాన్, మహ్మద్ మెహబూబ్, రిజ్వాన్ ఖాన్, వైఎస్ఆర్ కాలనీకి చెందిన ఇమ్రాన్ ఖాన్ పాల్గొన్నారు.