calender_icon.png 3 August, 2025 | 3:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మున్సిపల్ కమీషనర్ కు వినతి పత్రం అందజేత

03-08-2025 12:15:24 AM

కొత్తపల్లి,(విజయక్రాంతి): విలీనమైన గ్రామ పంచాయితీల్లో ఖాళీ జాగలకు ఇంటి నెంబర్లు ఇచ్చిన అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆడిషనల్ కమీషనర్ అల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అనంతరం ఎఐఎఫ్బీ జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి కోమటి రెడ్డి తేజ్ దీప్ రెడ్డి, బండారి శేఖర్ లు మాట్లాడుతూ కరీంనగర్ నగరపాలక సంస్థలో విలీనమైన రేకుర్తి, తీగలాగుత్తపల్లి, ఆరెపల్లి, అల్గునూర్, సదాశివపల్లి, పద్మనగర్ వాళ్ళంపాడ్ తదితర గ్రామాలల్లో ప్రభుత్వ భూములు, చెరువు శిఖం భూములల్లో ఓల్డ్ గ్రామ పంచాయితీ  పేరుతో నిర్మాణం అనుమతులు తీసుకున్న వారికీ  ఇంటి నెంబర్లు ఇచ్చినా అధికారులపై ఉద్యోగం నుండి రిమూవ్ చేయాలనీ డిమాండ్ చేశారు.

ఇంటి నెంబర్ కోసం సెల్ఫ్ అసెస్ మెంట్ కింద దరఖాస్తూ పెట్టితే ఎలాంటి ఎంక్వారీ చేయకుండా ఇంటి నెంబర్ ఇచ్చిన అధికారులను పక్కకు పెట్టడం సరింది కాదని విమర్శించారు. రేకుర్తిలో 1002 ఇంటి నెంబర్లు అక్రమంగా ఇచ్చారని పత్రికల్లో వస్తుంది మరి అక్రమంగా ఇచ్చిన అధికారుల గురించి ఎందుకు చర్యలు తీసుకోవద్దని ప్రశ్నించారు. నగరపాలక సంస్థలో విలీనమైన గ్రామాల ఓల్డ్ గ్రామ పంచాయితీ బుక్ లు ఎక్కడివి, వాటిమీద సంతాలు ఎవ్వరు పెట్టారు, రబ్బర్ స్టాంపు ఎక్కడివి అనేది ఎంక్వారీ చేయాలనీ డిమాండ్ చేసారు. ఇంటి నెంబర్ లు రద్దు చేస్తే చాలా మంది పేదలు,అమాయకులు నష్టపోతారని గుర్తుచేసారు. అక్రమా పద్ధతిలో ఇచ్చిన ఇంటి నెంబర్ లపై సమగ్ర విచారణ చేయాలనీ డిమాండ్ చేశారు.ఇందులో పేదలు అమాయకులు నష్టపోతే మాత్రం అల్ ఇండియా పార్టీ ఆధ్వర్యంలో నగరపాలక సంస్థ ముందు ఆందోళన చేస్తామని హెచ్చరించారు.