calender_icon.png 3 August, 2025 | 11:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అర్హులందరికీ కొత్త కార్డులు మంజూరు

03-08-2025 12:14:16 AM

సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావుగౌడ్

వారాసిగూడ, ఆగస్ట్ 2 (విజయక్రాంతి) : ప్రస్తుత ప్రభుత్వం చేపట్టిన కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియను స్వాగతిస్తామని, అయితే అర్హులందరికీ కొత్త కార్డులను అందించాలని సికింద్రాబాద్ శాసనసభ్యులు, మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో సితాఫలమండీ మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ లో కొత్త రేషన్ కార్డుల జారీ ని రాష్ట్ర రవాణా శాఖ, జిల్లా ఇంచార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి సుమారు 8 వేల మంది కొత్త రేషన్ కార్డుల కై దరఖాస్తు చేయగా ప్రస్తుతం 1803 మందికి కొత్త కార్డులు జారీ చేస్తున్నారని,  జీవనోపాధికి  కారు డ్రైవింగ్ చేసే వారి పేర్లను తొలగించరాదని, అర్హులందరికీ కార్డులు జారీ చేయాలని పద్మారావు గౌడ్ కోరారు.  సికింద్రాబాద్ నియోజకవర్గ అర్హులకు కొత్త కార్డులు లభించేలా తమ వంతు కృషి చేస్తామని తెలిపారు. 

 సితాఫలమండీ లో తమ నిరంతర శ్రమ కారణంగా ప్రభుత్వ హై స్కూల్, జూనియర్ కాలేజీ, డిగ్రీ కాలేజీ లు ఏర్పాటయ్యయని, రూ.29.75 కోట్ల ఖర్చుతో కొత్త భవనాల నిర్మాణానికి అనుమతులు సాధించి నప్పటికీ, నిధులు మం జూరు కాకపోవడంతో పనులు నిలిచిపో యాయని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్‌కు సితాఫలమండీ ప్రభుత్వ స్కూల్, కాలేజి భవనాల నిధులు మంజూరు చేయించాలని సికింద్రాబాద్ నియోజకవర్గ ప్రజల పక్షాన ఓ వినతి పత్రాన్ని పద్మారావు గౌడ్ అందించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దాసరి హరి చందన్, అధికారులతో పాటు కార్పొరేటర్లు సామల హేమ, రాసురి సునీత, కంది శైలజ, లింగాని ప్రసన్న లక్ష్మి శ్రీనివాస్, యువ నేత రామేశ్వర్ గౌడ్  తదితరులు పాల్గొన్నారు.