04-05-2025 01:01:45 AM
హైదరాబాద్, మే 3 (విజయక్రాంతి): కేఎల్‌హెచ్ యూనివర్సిటీ హైదరాబాద్ క్యాంపస్ ప్లేసెమెంట్ సక్సెస్ మీట్ శనివారం ఘనంగా జరిగింది. అజీజ్‌నగర్‌లో జరిగిన కార్యక్రమంలో కార్పొరేట్ కంపెనీ ప్రతినిధుల చేతుల మీదుగా ప్లేసెమెంట్స్ పొందిన విద్యార్థులు మెడల్స్, ప్రశంసా పత్రాలను అందుకున్నారు.
ముఖ్య అతిధిగా పాల్గొన్న జేపీ మోర్గన్ కంపెనీ ఉపాధ్యక్షుడు మారియో డేవిడ్ మాట్లాడుతూ.. మారు తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని విద్యార్థులు సంపూర్ణంగా అవగాహన చేసుకుంటే అ త్యుత్తమ ఉద్యోగాలు సాధింఛవచ్చు అన్నారు. కేఎల్ యూనివర్సిటీ ఉప కులపతి డాక్టర్ సారధి వర్మ మాట్లాడుతూ.. తమ విద్యార్థులు అత్యుత్త మ వార్షిక ప్యాకేజీలతో ప్లేసెమెంట్స్ సాధిం చారని తెలిపారు.
ఈ ఏడాది 75 లక్షల రూపాయల వార్షిక ప్యాకేజీతో తమ విద్యార్థి ప్లేసెమెం ట్ సాధించటం గర్వకారణమని హర్షం వ్యక్తం చేశారు. 20 లక్షల నుంచి 50 లక్షల రూపాయల లోపు వార్షిక ప్యాకేజీతో తమ విద్యార్థులు ప్లేస్ అయ్యారని అన్నారు. కేఎల్‌హెచ్ హైదరాబాద్ క్యాంపస్ డైరెక్టర్ డాక్టర్ ఆకెళ్ళ రామకృష్ణ మా ట్లాడుతూ.. విద్యార్థుల్లో నైపుణ్యాలను పెం పొందించటం, పారిశ్రామిక అనుబంధ శిక్షణ ఇవ్వ టం ద్వారా తమ విద్యార్థులు నాణ్యమైన ప్లేసెమెంట్స్ పొందగలుగుతున్నారని స్పష్టం చేశారు.