calender_icon.png 8 September, 2025 | 10:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తహసిల్దార్ కార్యాలయం ముందు సిపిఐ ధర్నా

08-09-2025 06:13:30 PM

వలిగొండ,(విజయక్రాంతి): వలిగొండ మండల సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో మండలంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తహసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. వర్షాలతో నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని వరికి ఎకరాకి 30 వేల రూపాయలు ఇవ్వాలని, పత్తికి ఎకరాకి రూ.50 వేలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇటీవలే కురిసిన వర్షాలకు ధ్వంసమైన రోడ్లను మరమ్మత్తులను చేయాలని, వీధిలైట్లు సమస్యను పరిష్కరించాలన్నారు.