08-09-2025 06:08:15 PM
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని 14వ వార్డు సోఫీ నగర్ కాలనీలో నెలకొన్న సమస్యలపై ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరుతూ కాలనీ నాయకులు రాహుల్ గౌడ్ ఆధ్వర్యంలో ఆర్డిఓ రత్న కళ్యాణ్ కి ఫిర్యాదు చేశారు కాలనీ ఏర్పడి 20 ఏళ్లు గడుస్తున్న సిసి రోడ్లు లేవని మురికి కాలువలు అస్తవ్యస్తంగా ఉన్నాయని విద్యుత్ దీపాలు సరిగ్గా వెలగడం లేదని పారిశుధ్య లోపం తలెత్తిందని అధికారులకు చెప్పిన పట్టించుకోవడంలేదని వినతిపత్రంలో పేర్కొన్నారు.