calender_icon.png 8 September, 2025 | 10:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాఠశాలకు నూతన భవనాన్ని నిర్మించాలి

08-09-2025 06:36:16 PM

మందమర్రి,(విజయక్రాంతి): పట్టణం లోని 21 వార్డు అంగడి బజార్ లోని మండల ప్రజా పరిషత్ పాఠశాలకు నూతన భవనాన్ని నిర్మించాలని రిపబ్లిక్ ఆన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్పిఐ) జిల్లా అధ్యక్షులు ఎండి రహమత్ ఖాన్ కోరారు. ఈ మేరకు సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో నిర్వహించిన గ్రీవెన్స్ లో ఆయన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ కు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. పాఠశాల భవనం నిర్మించి దాదాపు 50 సంవత్సరాలు గడిచి శిధిలావస్థకు చేరిందని, శిథిలమైన భవనంలోనే 61 మంది విద్యార్థులు ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని విద్యను అభ్యసిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఐటీ వల కురుస్తున్న భారీ వర్షాల కారణంగా భవనం ఎప్పుడు కూలి పోతుందోనని విద్యా ర్థులు వారి తల్లిదండ్రులు భయాందోళనలకు గురవు తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.విద్యార్థుల భద్రతను దృష్టిలో పెట్టుకొని శిధిలమైన భవనాన్ని భూస్థాపితం చేసి నూతన భవనం నిర్మించాలని,అప్పటి వరకు  అద్దె భవనంలో పాఠశాల కొనసాగించాలని ఆయన కోరారు. ఇటీవల నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవంలో శిథిలమైన పాఠశాల భవనాలను తొలగించి నూతన భవనాలు నిర్మిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించడాన్నీ ఆయన సందర్భంగా గుర్తు చేశారు.