25-10-2025 12:23:16 AM
పటాన్‌చెరు, అక్టోబర్ 24(విజయక్రాంతి): ఔటర్ రింగు రోడ్డుపై వెళ్తున్న కారులో మంటలు చెలరేగడంతో పెనుముప్పు తప్పింది. శుక్రవారం సిద్దిపేట జిల్లాకు చెందిన ఓ కుటుంబం శంకర్‌పల్లిలోని శుభకార్యానికి వెళ్తుండగా పటాన్‌చెరు ఎగ్జిట్ నంబర్ 3 సమీపంలో వారు ప్రయాణిస్తున్న కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. కారులో నుంచి పొగలు రావడంతో వారు భయాందోళనకు గురయ్యా రు.
ఇదే సమయంలో అటువైపుగా వెళ్తున్న బీఆర్‌ఎస్ నాయకుడు ఐలాపూర్ మాణిక్ యాదవ్ పరిస్థితిని గమనించి కారులో ఉన్న వారిని కిందకు దించేసి ప్రాణాలను కాపాడారు. వెంటనే ఫైర్ స్టేషన్‌కి ఫోన్ చేసి సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అయితే ఈ ఘటనలో ఎవరికీ ప్రాణాపాయం జరగలేదు.